ఈ నెల 18వ తేదీన ఢిల్లీలో జరిగే ఎన్డీయే భాగస్వామ పార్టీల సమావేశానికి రావాలని బీజేపీ పెద్దల నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి ఆహ్వానం వచ్చింది. శనివారం జనసేన పార్టీ ఈ విషయాన్ని వెల్లడించింది. పవన్‌తో పాటు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపింది. ఈ నెల 17వ తేదీ సాయంత్రానికి ఢిల్లీకి చేరుకుంటారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.