జిల్లాలో నాటు సారా తయారీ, గంజాయి సరఫరా విక్రయాలను పూర్తిస్థాయిలో నిర్మూలించడమే లక్ష్యంగా పోలీసుల పని చేయాలని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు. ఒంగోలు లోని జిల్లా పోలీసు కార్యాలయంలో నాటు సారా, గంజాయి వంటి మాదకద్రవ్యాల విక్రయం, సరఫరాలపై సంబంధిత అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి రవాణా చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.