ఒంగోలు కమిషనర్ వెంకటేశ్వరరావు సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలపై శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ లోని దుకాణాలను కమిషనర్ తనిఖీ చేసి ఓ దుకాణం వద్ద సింగిల్ యూస్ ప్లాస్టిక్ గ్లాసులను, కవర్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకొని రూ. 2, 000 జరిమానా విధించారు. కమిషనర్ మాట్లాడుతూ ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.