ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటైన వైద్య, డెంటల్ కాలేజీల్లో కాంపింటెంట్ అథారిటీ కోటా MBBS, BDS సీట్లలో 100 శాతం రాష్ట్ర విద్యార్థులకే దక్కేలా నిబంధనల్లో సవరణలు చేసింది. 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీలతో పాటు, కొత్తగా మంజూరైన MBBS, BDS సీట్లను ఏపీ విద్యార్థులతోనే భర్తీ చేయనున్నారు.