అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో యాత్రను నిలిపివేసినట్లు తెలుస్తోంది. పహల్గాం, బాల్టాల్ మార్గాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో అధికారులు యాత్రను నిలిపివేయాలని నిర్ణయించారు. కాగా, తొలి బ్యాచ్ లో 6,600 మంది యాత్రికులు దర్శనానికి బయల్దేరగా, పలు ప్రమాద ఘటనల్లో ఇద్దరు యాత్రికులు మృతిచెందారు.