ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతుంటే, ఓ వ్యక్తి తమ కుమార్తెకు టమాటాలతో తులాభారం ఇచ్చిన ఘటన ఏపీలోని అనకాపల్లిలో జరిగింది. పట్టణానికి చెందిన మళ్ల జగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్య తులాభారం నూకాలమ్మ ఆలయంలో ఆదివారం నిర్వహించారు. ముందుగా 51 కేజీల టమాటాలతో, తర్వాత బెల్లం, పంచదారతో నిర్వహించారు. వీటిని అమ్మవారి నిత్యాన్నదానంలో ఉపయోగిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.