ముంబైలోని మలాడ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మార్వే క్రీక్‌లో ఐదుగురు బాలురు గల్లంతయ్యారు. మార్వే క్రీక్ వద్ద సరదాగా గడిపేందుకు ఐదుగురు బాలురు వెళ్లారు. నీటిలోకి వెళ్లి గల్లంతయ్యారు. స్థానికులు రెస్క్యూ టీమ్‌కు సమాచారం ఇవ్వడంతో కృష్ణ జితేంద్ర హరిజన్, అంకుష్ భరత్ శివరే అనే ఇద్దరు బాలురులను రక్షించారు. శుభంరాజ్ కుమార్ జైస్వాల్, నిఖిల్ సాజిద్ కయంకుర్, అజయ్ జితేంద్ర హరిజన్ అనే ముగ్గురు బాలుర కోసం గాలింపు చర్యలు చేపట్టారు