మధ్యప్రదేశ్లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర్ జిల్లాలోని సనోధ పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వెళ్తున్న లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందాడు. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ట్రక్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్పీ అభిషేక్ తివారీ అన్నారు.