17 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు కాలేజీ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చోటు చేసుకుంది. బాధితురాలు తన స్నేహితుడితో కలిసి అజ్మీర్ నుంచి జోధ్‌పూర్‌కి వెళ్లింది. పౌటా చౌరాహా దగ్గర సమందర్ సింగ్, ధర్మపాల్ సింగ్, భట్టమ్ సింగ్ అనే ముగ్గురు యువకులు వారిద్దరిని కలిసి సహాయం చేస్తామని నమ్మించారు. జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీ ఓల్డ్ క్యాంపస్‌లో ఉన్న హాకీ గ్రౌండ్‌కు తీసుకెళ్లి.. బాధితురాలి స్నేహితుడిని చితకబాదారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు.