దాయాది దేశం పాకిస్థాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ద్రవ్యోల్భణం పెరగడంతో ఆ దేశంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా గోధుమ ధరలు భారీగా పెరిగాయి. గోధుమ పిండి కిలో రూ.320కి చేరింది. కరాచీలో 20 కిలోల గోధుమ బస్తా ధర రూ.3200కు చేరింది. ఇస్లామాబాద్, రావల్పిండి, సియాల్ కోట్, ఖుజ్దర్‌లో 20 కిలోల బస్తాపై రూ.106, రూ.133, రూ.200, రూ.300 చొప్పున పెరిగాయి. హైదరాబాద్‌లో ఈ ధర రూ.3040గా ఉంది.