హిందూపురం వైసీపీ రాజకీయం కొత్తమలుపు తిరిగింది. 2019 ఎన్నికల్లో ఇక్కడి వైసీపీ ప్రధాననేత నవీన్ నిశ్చల్‌కు బదులు మహమ్మద్ ఇక్బాల్‌కు పార్టీ టికెట్ ఇవ్వగా, ఆయన బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు. నాటినుంచి ఇక్బాల్, నవీన్‌ల మధ్య మాటల్లేవు. అయితే.. తాజాగా దీపికారెడ్డిని ఇక్కడ ఇన్చార్జ్గా ప్రకటించటంతో షాకైన వీరిద్దరూ వైరాన్ని పక్కనబెట్టిన భేటీ అయ్యారు. తమలో ఎవరికి టికెట్ వచ్చినా సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారట.