వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగిన ఘటన మధ్యప్రదేశ్ లోని కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్ లో జరిగింది. భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రైలు ఉదయం 5.40 గంటలకు భోపాల్ నుంచి బయలుదేరింది. కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సమయంలో ఒక కోచ్‌లోని బ్యాటరీ బాక్స్ లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.