పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి తల్లిదండ్రులపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లాలోకి డక్కిలికి చెందిన ఓ యువకుడు కొంతకాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.పెళ్లి చేసుకోవాలని కుటుంబ పెద్దలకు ఈ విషయం చెప్పారు. ప్రియురాలి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దాంతో కక్ష పెంచుకున్న యువకుడు కత్తితో వారిద్దరిపై దాడి చేశాడు. యువతి తండ్రికి తీవ్ర గాయాలవ్వడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.