గతకొంత కాలంగా నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలోనే 1.67 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 1.46 కోట్ల మందికి ప్రతినెలా 2.11 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామని.. ఇందుకోసం నెలకు రూ. 846 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా అరుణ్ పేర్కొన్నారు.