రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆదివారం దారుణ ఘటన జరిగింది. 17 ఏళ్ల బాలిక అజ్మీర్‌కు చెందిన తన ప్రియుడితో కలిసి పారిపోయి జోధ్‌పూర్‌కు చేరుకుంది. వారిని ముగ్గురు విద్యార్థులు దాడి చేశారు. యూనివర్శిటీ క్యాంపస్‌లోని హాకీ గ్రౌండ్‌కు తీసుకెళ్లారు. అక్కడ ప్రియుడి కళ్ల ముందే బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను సోమవారం అరెస్ట్ చేశారు.