ఏపీలో రాజకీయం ముదురుతోంది. ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి జోగి రమేష్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వ్యక్తి పిచ్చి కుక్కతో సమానం అని మండిపడ్డారు. వీధి కుక్కలు మొరుగుతాయి.. వాటిని పట్టించుకోవాల్సిన పని లేదంటూ సెటైర్లు వేశారు. రానున్న ఎన్నికల్లో పవన్, చంద్రబాబు, లోకేష్‌ని జనం తరిమి తరిమి కొడతారని వ్యాఖ్యానించారు.