పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యేలోపే పార్లమెంటును రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. 'ఆగస్టు 12నాటికి మా ప్రభుత్వ పదవీకాలం పూర్తవుతుంది. కానీ, అంతకుముందే అధికారం నుంచి దిగిపోతాం. ఆపద్ధర్మ ప్రభుత్వానికి పాలనా బాధ్యతలు అప్పగిస్తాం' అని షెహబాజ్ అన్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఈ క్రమంలోనే నవంబరులో పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.