స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాలతో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 529 పాయింట్లు లాభపడి 66,590 వద్ద ముగిసింది. నిఫ్టీ 147 పాయింట్లు పెరిగి 19,711 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.81%), విప్రో (2.54%), రిలయన్స్ (2.10%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (2.07%), కోటక్ బ్యాంక్ (1.45%).
టాప్ లూజర్స్ : టాటా మోటార్స్ (-1.02%), భారతీ ఎయిర్‌టెల్ (-0.89%), టైటాన్ (-0.70%), జేఎస్ స్టీల్ (-0.66%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.66%).