ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం జరిగే సమావేశానికి 38 పార్టీలు హాజరవుతాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి జనసేనకు ఆహ్వానం అందింది. బీజేపీతో పొత్తుకు కూడా సిద్ధమన్నారు. ఢిల్లీలో మాట్లాడిన పవన్ కల్యాణ్..ఏపీలోనూ బీజేపీ నేతలతో పొత్తులపై చర్చించే అవకాశం ఉందన్నారు.