ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 18 నుంచి ఉత్తర కోస్తాలో, 1వ తేదీ నుంచి మిగిలిన కోస్తాలో వర్షాలు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.