కర్ణాటక రాజధాని బెంగళూరులో సోమవారం రాత్రి జాతీయ ప్రతిపక్ష నేతల సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు సమావేశం జరిగింది. జాతీయ రాజకీయాలు, 2024 ఎన్నికలు, పార్టీల మధ్య సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఇదిలా ఉండగా.. ఈ భేటీ ఎజెండాకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా రేపు మరోసారి సమావేశం కావాలని విపక్ష నేతలు నిర్ణయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa