దేశ రాజధాని ఢిల్లీని డెంగీ జ్వరాలు వణికిస్తున్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరదనీరు నిలిచి ఉండటంతో దోమల బెడద పెరిగింది. దీంతో ఇప్పటికే ఢిల్లీలో 163 మందికి డెంగీ జ్వరాలు సోకాయి. యమునా నది వరదలు వెల్లువెత్తిన క్రమంలో గడచిన వారం రోజుల్లోనే 39 డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 10 మంది డెంగీ జ్వరాలతో బాధ పడుతుండగా. డెంగీ జ్వరాలతో పాటు 14 చికున్ గున్యా, 54 మలేరియా కేసులు నమోదయ్యాయి.