ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వరదలు పోటెత్తడంతోపాటు ఆయా ప్రాంతాల్లో కొండచరియలు, చెట్లు విరిగిపడుతున్నాయి. మనేరి డ్యామ్ దగ్గర్లోని గంగోత్రి హైవే దగ్గర కొండచరియలు విరిగిపడటంతో ఓ మినీ ట్రక్కు లోయలో పడిపోయింది. అయితే ట్రక్కులో ఎవరైనా ఉన్నారా? లేరా? అనే విషయంపై స్పష్టత లేదు. రోడ్డుపై కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆయా ప్రాంతాలలో గంగోత్రి హైవేను అధికారులు మూసివేశారు.