మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరుపనుంది. ఈ కేసులో అవినాష్‌కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇవాళ విచారణ జరుపనున్నారు.