స్టీల్‌ప్లాంటులో కాంట్రాక్టర్ల వద్ద పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కొత్త కాంట్రాక్టర్లు వచ్చినపుడు మార్చేస్తున్నారని, అలా కాకుండా వారినే కొనసాగించేలా చూడాలని సీఎండీ అతుల్ భట్ని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోరారు. సోమవారం ఆయన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో కలిసి సీఎండీని కలిశారు. ఆర్ కార్డులు కలిగిన వారికి శాశ్వత ప్రాతిపదికన ప్లాంటులో ఉపాధి కల్పించాలన్నారు.