సోమావతి అమావాస్య సంధర్బంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకంబికా అమ్మవారిని మాజీ శాసనసభ్యులుపీలా గోవింద సత్యనారాయణ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం జరిగినఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్ మళ్ళ సురేంద్ర, అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు జోగీ నాయుడు, క్లస్టర్ ఇంచార్జి తలారి కాశీ నాయుడు, సురే సతీశ్ కుమార్, పోలారపు త్రినాద్ యల్లపు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.