విశాఖపట్నం: ఆనందపురం మండలంలోని శ్రీ భూలోక మాత ఆలయం సమీపంలో గల ప్రభుత్వ బాలికల వసతి గృహంనకు వెళ్లే తారు రోడ్డు పూర్తిగా శిధిలం అయ్యి రాళ్లు తేలిపోవడంతో హాస్టల్ విద్యార్థినులు,శ్రమజీవుల కాలనీవాసులు ఈ రోడ్డు గుండా వెళ్లడానికి నరకయాతన పడుతున్నారు. పూర్తిగా శిధిలమైన ఈ రోడ్డుకు నిధులు మంజూరు చేసి పూర్తిస్థాయిలో రోడ్డును ఏర్పాటు చేయాలని కాలనీవాసులు, హాస్టల్ విద్యార్థినులు, సిబ్బందిసోమవారం మీడియాద్వారా కోరుతున్నారు.