మోదీ ఇంటిపేరు వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో రాహుల్‌ను దోషిగా తేలుస్తూ సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై స్టే విధించాలని ఆయన గుజరాత్ హైకోర్టు గడప తొక్కగా. స్టేకు నిరాకరిస్తూ కోర్టు ఈనెల 7న తీర్పు వెలువరించింది. దీంతో రాహుల్ సుప్రీంకోర్టులో ఈనెల 15న పిటిషన్ దాఖలు చేయగా ఈ నెల 21న విచారణ జరుగనుంది.