యూపీ సీఎం యోగి, కేంద్ర మోదీ ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉందని ఓ గుర్తుతెలియని వ్యక్తి ముంబై పోలీసుల ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి బెదిరించాడు. కొన్నిచోట్ల తూటాలు, ఏకే-47లు ఉన్నాయని, ముంబైలో 26/11 తరహా దాడి పునరావృతం అవుతుందని హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు ఆ గుర్తుతెలియని వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 509(2) కింద వర్లీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.