ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవకు అనారోగ్య కారణాలపై మాగుంటకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో ఢిల్లీ హైకోర్టు రాఘవకు బెయిల్ ఇవ్వగా దాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా.. ఈరోజు మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని మాత్రం ఈడీ వ్యతిరేకించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఫిబ్రవరి 10న రాఘవను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.