ఈనెల 21న సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం రాక సందర్భంగా వెంకటగిరిలో అధికారులు ఏర్పాటు మొదలుపెట్టారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి విగ్రహ ప్రారంభోత్సవం కోసం రోడ్ల పక్కన ఉన్న దుకాణాలను ఖాళీ చేయిస్తున్నట్లు చిరు వ్యాపారులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. తమ దుకాణాలును తొలగించడంతో రోడ్ సైడ్ దుకాణా దారులు, చిరు వ్యాపారులు బోదిబోమంటున్నారు.