విశాఖ నగరంలోని ఆరిలోవ సిద్ధార్థనగర్‌లో ఘోరం జరిగింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన స్వప్న అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే... స్వప్న నగరంలోని బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. అక్టోబర్ యువతికి వివాహం చేయాలని కుటుంబసభ్యులు నిశ్చయించారు. అయితే ఇంతలోనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు అరకు డుంబ్రిగూడ ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్వప్న మృతిపై ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా స్వప్న మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.