జీ20 ఆర్థికమంత్రుల మూడో సమావేశం సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్.. చైనా ఆర్థికమంత్రి లియు కున్తో భేటీ అయ్యారు. ఇందులో రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు, ద్రవ్యోల్బణం, వాణిజ్యంపై చర్చించారు. దాంతో పాటు ఆర్థిక అభివృద్ధికి అనువైన వ్యాపార వాతావరణ ప్రాముఖ్యతను గుర్తించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత జీ20 అధ్యక్షతన ఎన్నో అంశాల్లో సత్ఫలితాలను అందుకున్నామని లియు పేర్కొన్నారు.