బొబ్బిలి మున్సిపాలిటీ 5వ సచివాలయం పరిధిలో మంగళవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పాల్గొన్నారు. సురక్ష కార్యక్రమంలో భాగంగా 10వ సచివాలయ పరిధిలో వారం రోజులు పాటు ప్రభుత్వ అధికారులు, వాలంటీర్లు సర్వే చేపట్టి ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు కోసం నమోదు చేయగా మంజూరు కాబడిన ధ్రువీకరణ పత్రాలును ఎమ్మెల్యే శంబంగి చేతులు మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.