ప్రధాని నరేంద్ర మోదీకి భారత్‌ను పాలించే అవకాశం పదేళ్ల పాటు రావడంతో దేశంలోని ప్రతి రంగాన్ని ఆయన నాశనం చేశారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. ఆయన ప్రజల్లో విద్వేషాన్ని పెంపొదించారని ధ్వజమెత్తారు. ఆర్థిక వ్యవస్థ నాశనమైందని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత భారీగా పెరిగిందని దుయ్యబట్టారు. మోదీని తొలగించే సమయం ఆసన్నమైందని అందరు కలసి ఐక్యంగా పోరాడాలని చెప్పారు.