భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ మంగళవారం ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరయ్యారు. రెజ్లర్లపై లైంగిక ఆరోపణల కేసులో ఆయన కోర్టు విచారణకు వెళ్లారు. ఢిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన కేసులో కోర్టు బ్రిజ్‌కు సమన్లు జారీ చేసింది. తాజాగా కోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచీకత్తుపై బెయిల్ జారీ చేసింది.