వాయవ్య బంగాళాఖాతంలో 48 గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దీంతో ఏపీరాష్ట్రంలో అనేక చోట ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రానికి బలహీనపడింది. ఈ ప్రభావంతో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయంటున్నారు.
ఉత్తర కోస్తా, యానం ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వానలకు అవకాశం ఉందంటున్నారు. బుధవారం తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిస్తాయని అంచనా వేస్తున్నారు. నేడు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అత్యధికంగా 4.9 సెంటీమీటర్లు, పాతపట్నంలో 3.1, పలాసలో 3, మందసలో 2.8, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో 2.5, పల్నాడు జిల్లా అచ్చెంపేటలో 2, శ్రీకాకుళం జిల్లా సోంపేటలో 2 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయి.
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం - ఐఎండీ
తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. నేడు రంగారెడ్డి, మెదక్,ములుగు, భద్రాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, జనగాం,నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటున్నారు. బుధవారం కూడా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు.అంతేకాదు బుధవారం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. అయ్యింది. గురువారం నుంచి శుక్రవారం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. దీంతో వర్షాలు మరింత జోరందుకోనున్నాయి. ఈ వర్షాలతో పలు జిల్లాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అలాగే రైతులు కూడా వ్యసాయ పనుల్ని మరింత ముమ్మరం చేశారు.