బెంగళూరులో ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దాడులు నిర్వహించారు. కేంద్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, సీసీబీ సంయుక్తంగా జరిపిన ఆపరేషన్లో జునైద్, సోహైల్, ఉమర్ సహా ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి ఫోన్లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా బెంగళూరు వాసులేనని, ఉగ్రవాదులతో సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు.