ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో యమునా నది మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది. గత కొద్దిరోజులుగా ఈ నదీ ప్రవాహం తగ్గుముఖం పట్టగా, బుధవారం ఉదయానికి నీటిమట్టం మళ్లీ ప్రమాదకర స్థాయిని దాటింది. ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యుమనా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయిని దాటి 205.48 మీటర్లుగా నమోదైంది. నేడు సాయంత్రానికి ఇది 205.72 మీటర్లను చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.