ఈనెల 21నుంచి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఓటరు జాబితా సవరణ నేపథ్యంలో తెదేపా కార్యకర్తలు అప్రమ త్తంగా ఉండాలని జీవీఎంసీ 51వ వార్డు తెదేపా అధ్యక్షుడు తాతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళ బుధ వారాల్లో వార్డు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇంటింటా సర్వే నిర్వహిస్తారని ఎవరైనా బోగస్ ఓట్లు ఉంటే తొల గించాలని, అన్యాయంగా తొలగిస్తే వారిని చేర్పించేలా కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలన్నారు.