ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌కు చెందిన అజయ్‌కి బంగ్లాదేశ్ మహిళ జూలి ఫేస్బుక్లో పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. దాంతో జూలి తన 11 ఏళ్ల కూతురితో భారత్‌కు వచ్చేసింది. హిందూ మతంలోకి మారి అజయ్‌ను పెళ్లి కూడా చేసుకుంది. కొన్నాళ్లపాటు అంతా సజావుగానే సాగింది. వీసా గడువు ముగుస్తుందని భర్త అజయ్, కూతురితో కలిసి బంగ్లాదేశ్ బార్డర్‌కు వెళ్లింది. ఆ విషయాన్ని అజయ్ తన తల్లికి చెప్పి వెళ్లాడు. రెండు నెలలు గడిచిన తన కొడుకు తిరిగి రాకపోవడంతో అజయ్ తల్లి పోలీసులను ఆశ్రయించింది.