రాష్ట్రంలో అర్చకులు, పురోహితుల స్థితిగతులు మరింత మెరుగుపర్చడమే ధ్యేయంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించామని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక పురోహిత సంఘం విశాఖ జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు అంబటిపూడి సుధీర్ కుమార్ శర్మ, మావుడూరు సంపత్ కుమార్ శర్మ లు తెలిపారు. విశాఖలోని వన్ టౌన్ పరిధిలో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వందలాదిమంది పాల్గొన్నారు.