అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు సీజ్ చేశారు. తెనాలి పట్టణం కొల్లిపర గ్రామం వద్ద ఇసుక అక్రమంగా తరలుతోందన్న సమాచారంతో తెనాలి ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ ఏవీ చలం తమ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. రెండు లారీలకు ఎటువంటి అనుమతులు లేకుండ ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. మంగళవారం వాహనాలను సీజ్ చేసి కొల్లిపర పోలీసులకు అప్పగించారు.