ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని గద్దలగుంట గ్రామ సచివాలయాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో కమిషనర్ మాట్లాడి పారిశుధ్య చర్యలపై ఆరా తీశారు. అలాగే సచివాలయాల్లోని రికార్డులను కమిషనర్ పరిశీలించి, సచివాలయ సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. కమిషనర్ వెంట అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa