తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోతో వైసీపీలో వణుకు మొదలైందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మెహన్‌నాయుడు అన్నారు. భవిష్యత్‌కు గ్యారెంటీ పేరిట నిర్వహిస్తున్న బస్సు యాత్ర నాలుగో రోజు మంగళవారం నరసన్నపేట నియోజకవర్గంలో ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలన్నీ తీరుస్తామని భరోసా ఇచ్చారు. అన్నివర్గాలకు న్యాయం చేస్తామన్నారు. ప్రజలు టీడీపీని గెలిపించాలని కోరారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కివెళ్లిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa