ప్రకాశం జిల్లా, సంతనూతనపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే టీజేఆర్.సుధాకర్‌బాబును జనసేన నేతలు తీవ్రంగా హెచ్చరించారు పవన్‌పై టీజేఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం నాగులుప్పలపాడులోని జనసేన పార్టీ కార్యా లయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు తన స్థాయి మరచి పవన్‌కల్యాణ్‌పై విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నియోజకవర్గంలోని ఇసుక, గ్రావెల్, మ ట్టి, గ్రానైట్ వంటి సహజ వనరులను కొల్లగొడు తూ అక్రమంగా రూ.కోట్లు గడించినట్లు ఆరోపించారు. ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టించిన ఘనత సుధాకర్‌బాబుకే దక్కిందని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa