మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఈ పథకం ఏడో విడతలో చిరువ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తులవారికి బ్యాంకుల ద్వారా రూ.10 వేల చొప్పున వడ్డీలేని రుణాలను బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ కలెక్టరేట్ వివేకానంద సమావేశ మందిరం నుంచి ఎంపీ గీత, కలెక్టర్ కృతికాశుక్లా, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, కుడా చైర్‌పర్సన్ రాగి రెడ్డి చంద్రకళాదీప్తి.. డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు, లబ్ధిదారులతో కలిసి పాల్గొన్నారు. సీఎం బటన్‌నొక్కి వడ్డీ లేని రుణాలను, వడ్డీ రియంబర్స్‌మెంట్ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన అనంతరం ఎంపీ, కలెక్టర్.. అధికారులతో కలిసి లబ్ధిదారులకు మెగా చెక్కు అంద జేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏడో విడతలో రూ.23.52 కోట్ల రుణాలను అందించడం జరుగు తోందన్నారు.