నాలుగేళ్ళలో వైసీపీ ప్రభుత్వం 7,14,631 కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. దీనిలో అధికారికంగా చేసింది రూ.2,39,716 కోట్లు కాగా అనధికారికంగా రూ.4,74,315 కోట్ల అప్పులు చేసిందన్నారు. టిడిపి అధికారం నుంచి దిగిపోయే నాటికి రూ.3,62,375 కోట్లు అప్పు ఉందని, మొత్తం కలుపుకుంటే రూ.10,77,006 కోట్లకు చేరిందన్నారు. అనధికార అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.