లాటిన్ అమెరికా దేశమైన ఎల్ సాల్వడార్ లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ మహా సముద్ర తీరంలోని ప్రాదేశిక జలాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత 6.5గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. సముద్ర గర్భంలో 70 కి.మీ లోతులో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది. దేశ రాజధాని సాన్ సాల్వడార్ కు తీర పట్టణమైన లా లిబర్టెడ్ లో కూడా భూమి కంపించిందని అధికారులు తెలిపారు.