తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన పద్మావతి ఎక్స్‌ప్రెస్ తిరుపతి రైల్వే స్టేషన్‌లోని యార్డ్‌లో పట్టాలు తప్పింది. షంటింగ్ చేస్తుండగా పట్టాలు తప్పిందని అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా పద్మావతి ఎక్స్‌ప్రెస్ 2 గంటల 50 నిమిషాలు ఆలస్యంగా నడుస్తోంది. దీంతో పాటు తిరుపతి నిజాముద్దీన్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను కూడా రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు.
పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. తిరుపతి రైల్వే స్టేషన్‌లోని యార్డ్‌లో బుధవారం (జూలై 19) సాయంత్రం పట్టాలు తప్పింది. షంటింగ్ చేస్తుండగా ఓ బోగీ పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. రైల్వే సిబ్బంది వెంటనే మరమ్మతు పనులు చేపట్టారు. ఈ కారణంగా రైలును రీషెడ్యూల్ చేశారు. ఆలస్యంగా బయలుదేరనుంది. పద్మావతి ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరో రైలును కూడా రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ బయల్దేరాల్సిన పద్మావతి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్. 12763) సాయత్రం 4.55 గంటలకు బయలు దేరాల్సి ఉండగా.. బుధవారం రాత్రి 7.45 గంటలకు బయల్దేరనుంది. అదేవిధంగా తిరుపతి - నిజాముద్దీన్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా రీషెడ్యూల్ చేశారు. తిరుపతి నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరాల్సిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రాత్రి 8 గంటలకు బయల్దేరుతుందని రైల్వే అధికారులు ప్రకటించారు.